భారతదేశం, నవంబర్ 2 -- జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. శనివారం బోరబండలో నిర్వహించిన కార్నర్ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.నవీన్ యాదవ్ ను అత్యంత భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పారు.

జూబ్లీహిల్ ఓటర్లను తప్పుదోవ పట్టించడానికి రామారావు (కేటీఆర్), హరీష్ రావు ఆటోరిక్షాల్లో తిరుగుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. సొంత చెల్లి కవిత అడిగిన ప్రశ్నలకే కేటీఆర్ సమాధానం చెప్పటం లేదని దుయ్యబట్టారు. "ఏ ఆడబిడ్డ సొంత ఇంటి మీద ఆరోపణలు చేయదు. సొంత చెల్లిని పట్టించుకోని వారు.. చిన్నమ్మ బిడ్డలను చూస్తారా.? ఆస్తులు ఇవ్వా్ల్సి వస్తుందని కేటీఆర్‌ చెల్లిని పక్కనపెట్టాడు" అని రేవంత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నేతల మాయ...