భారతదేశం, నవంబర్ 7 -- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ కు సమయం దగ్గరపడింది. ఈనెల 11వ తేదీన పోలింగ్ జరగనుంది. మరోవైపు ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అయితే నగరంలోని పలువురు బీఆర్ఎస్ నేతల ఇళ్లల్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు చేపట్టాయి.

మోతి నగర్ పరిధిలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో, కూకట్‌పల్లి బీఎస్పీ కాలనీలోని ఎమ్మెల్సీ తక్కళ్ళపల్లి రవీందర్ రావు ఇంట్లో ఈ తనిఖీలను నిర్వహించారు. ఉపఎన్నిక కోసం డబ్బులను నిల్వ చేశారనే ఫిర్యాదుతో ఈ సోదాలు జరిపినట్లు సమాచారం.

మరోవైపు ఈ సోదాలను బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులో లేని ప్రాంతంలో, అనుమతి లేకుండా పోలీసులు తమ ఇంట్లోకి ఎలా వస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సోదాలపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి. ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం...