భారతదేశం, సెప్టెంబర్ 2 -- కొంత కాలంగా ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న విషయం తెలిసిందే. పార్టీలోని కీలక నేతలపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోనూ హరీశ్ రావు, సంతోష్ రావుపై సంచనల వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమెను సస్పెండ్ చేస్తారని చాలామంది అనుకున్నారు. తాజాగా అదే జరిగింది.

గులాబీ బాస్ కేసీఆర్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేశారు. పార్టీ లైన్ దాటడంతో కవితపై వేటు వేశారు. 'పార్టీ ఎమ్మెల్సీ కవిత ఇటవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.' బీఆర్ఎస్...