Telangana,hyderabad, జూన్ 21 -- హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మనోజ్ రెడ్డి అనే క్వారీ యాజమానిని బెదిరించినట్లు ఫిర్యాదు అందింది.ఈ మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఇవాళ శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కౌశిక్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై బీఎన్ఎస్ 308(2), 308(4), 352 కింద కేసులు నమోదయ్యాయి.

కౌశిక్ రెడ్డిని హైదరాబాద్ నుంచి వరంగల్ కు తరలించారు. ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టు రిమాండ్ విధిస్తే జైలుకు తరలించే అవకాశం ఉంది. మరోవైపు కౌశిక్ రెడ్డి తరపున బీఆర్ఎస్ లీగల్ టీమ్ రంగంలోకి దిగింది.

పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ ను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు....