భారతదేశం, జనవరి 4 -- సూర్యాపేటలో కల్వకుంట్ల కవిత విలేకర్లతో మాట్లాడారు. అసెంబీలో ప్రతిపక్షం లేకుండా కృష్ణానీటిపై ప్రభుత్వం అబద్ధాలు చెప్పిందని విమర్శించారు. వ్యక్తిగతంగా హరీశ్ రావును ఒక్క మాట అన్నారని అసెంబ్లీని బాయ్‌కాట్ చేస్తారా అని ప్రశ్నించారు. తర్వాతైనా అసెంబ్లీకి రావొచ్చు కదా అన్నారు. మిగతా బిల్లులపై చర్చ జరుగుతుంటే.. ప్రతిపక్షం ఉండొద్దా అని అడిగారు. సభ నుంచి వాకౌట్ చేయాలనే.. నిర్ణయం హరీశ్ రావుదేనా అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో హరీశ్ ఓ గుంపును తయారు చేస్తున్నారని కవిత ఆరోపించారు. బాయ్‌కాట్ నిర్ణయం అధిష్టానానిదే అయితే.. అది మంచిది కాదని విమర్శించారు.

'బయట సభలు పెడుతూ చట్టసభల్లో మాట్లాడే అవకాశం వదులుకోవడం కరెక్ట్ కాదు. కృష్ణా పంపకాల్లో హక్కులు తగ్గించి హరీశ్ సంతకం ఎందుకు పెట్టారు. అది చెప్పి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ చేయాల్సింది. హరీశ్ ...