భారతదేశం, అక్టోబర్ 10 -- బిహార్​ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. ప్రశాంత్ కిషోర్ (పీకే) నేతృత్వంలోని జన్ సూరాజ్ పార్టీ తన తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మొత్తం 51 మంది అభ్యర్థులతో కూడిన ఈ జాబితాలో డాక్టర్లు, న్యాయవాదులు, రిటైర్డ్ అధికారులు, పోలీసు అధికారులతో పాటు ఓ ట్రాన్స్‌జెండర్ మహిళ అయిన ప్రీతి కిన్నర్‌కు అవకాశం దక్కడం బిహార్ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

జన్ సూరాజ్ పార్టీ ప్రీతి కిన్నర్‌ను గోపాల్‌గంజ్ జిల్లాలోని భోరే నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా ప్రకటించింది. ఇక్కడ.. ప్రీతి, రాష్ట్రంలోనే హై-ప్రొఫైల్ కలిగిన సిట్టింగ్ మంత్రితో పోటీ పడబోతున్నారు. భోరే ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే, నితీష్ కుమార్ మంత్రివర్గంలో బిహార్​ విద్యాశాఖ మంత్రి అయిన సునీల్ కుమార్‌తో ఆమె పోటీ పడనున్నారు.

భోరే బ్లాక్ పరిధిలోని కల్యాణ్‌పూర్ గ్రామానికి చెందిన...