Hyderabad, జూన్ 19 -- టాలీవుడ్‌లో డైరెక్టర్‌గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శేఖర్ కమ్ముల. ఎన్నో బ్యూటిపుల్ సినిమాలు అందించిన ఆయన దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ కుబేర. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో రూపొందించిన కుబేర మూవీలో నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా, జిమ్ సర్బ్ ప్రధాన పాత్రలు పోషించారు.

అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎస్‌వీసీఎల్ఎల్‌పీ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు కుబేరా చిత్రాన్ని హై బడ్జెట్‌తో, హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మించారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా కుబేర విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ శేఖర్ కమ్ముల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

-మోటివేషన్ అంటూ ఏం లేదు కానీ ఇది ఒక ఇంట్రెస్టింగ్ లైన్ అనిపించింది....