భారతదేశం, డిసెంబర్ 23 -- ట్రెండ్స్ వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ బిర్యానీ క్రేజ్ మాత్రం ఎప్పటికీ తగ్గదు. ఈ విషయాన్ని ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ 'స్విగ్గీ' (Swiggy) విడుదల చేసిన 2025 వార్షిక నివేదిక మరోసారి స్పష్టం చేసింది. భారతీయుల పాలిట బిర్యానీ కేవలం ఒక వంటకం కాదు, అదొక ఎమోషన్ అని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి.

స్విగ్గీ నివేదిక ప్రకారం, 2025లో దేశవ్యాప్తంగా నిమిషానికి సగటున 194 బిర్యానీలు ఆర్డర్ అయ్యాయి. అంటే ప్రతి 3.25 సెకన్లకు ఒక బిర్యానీ అమ్ముడైందన్నమాట. ఈ ఏడాది మొత్తం మీద స్విగ్గీ ద్వారా 9.3 కోట్ల బిర్యానీలను భారతీయులు ఆరగించారు. ఇందులో 'చికెన్ బిర్యానీ' 5.77 కోట్ల ఆర్డర్లతో మొదటి స్థానంలో నిలిచి తన సత్తా చాటుకుంది.

బిర్యానీ తర్వాతి స్థానాల కోసం గట్టి పోటీ నెలకొంది. ఈ ఏడాది మోస్ట్ ఆర్డర్డ్ లిస్ట్‌లో టాప్ 4 డిషెష్ ఇవే:

వరుసగా ...