భారతదేశం, ఆగస్టు 8 -- చనుబాలు ఇవ్వడం (breastfeeding) వల్ల చాలా మంది మహిళలకు పీరియడ్స్ ఆలస్యంగా వస్తుంటాయి. దీంతో చాలామంది దీన్ని సహజ గర్భనిరోధక సాధనంగా భావిస్తారు. అయితే, ఇది ఎంతవరకు నిజం? దీనిపై ఉన్న అపోహలను ప్రముఖ వైద్యులు ఎలా ఖండించారో ఇప్పుడు చూద్దాం.

తల్లిపాలు ఇచ్చేటప్పుడు పీరియడ్స్, గర్భం ధరించడం వంటి విషయాలపై చాలామందికి అనేక సందేహాలు ఉంటాయి. "తల్లిపాలు ఇస్తుండగా గర్భం వస్తుందా?", "తల్లిపాలు ఇవ్వడం వల్ల పీరియడ్స్ ఆలస్యమవుతాయా?", "ఇది నిజంగానే గర్భనిరోధక పద్ధతా?" లాంటి ప్రశ్నలు సాధారణంగా ఎదురవుతుంటాయి. ఈ సందేహాలపై అపోహలు పెరిగిపోతుంటాయి. ఈ నేపథ్యంలో స్పష్టమైన అవగాహన ఉండటం చాలా ముఖ్యం.

సిల్వర్ స్ట్రీక్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌లోని సీనియర్ కన్సల్టెంట్, ప్రసూతి, గైనకాలజిస్ట్ డాక్టర్ స్వప్నిల్ అగ్రహారి తల్లిపాలు ఇవ్వడం వల్ల గర్భధారణప...