భారతదేశం, సెప్టెంబర్ 1 -- సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నటి ఇలియానా. ఇప్పుడు ఇద్దరు కుమారుల తల్లిగా పూర్తిస్థాయిలో మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న ఆమె, ఇటీవల తన ప్రసవానంతర అనుభవాలను పంచుకుంది. ముఖ్యంగా బిడ్డకు పాలివ్వడం విషయంలో ఎదురైన సవాళ్లను, భావోద్వేగాలను నిస్సంకోచంగా వెల్లడించింది.

తల్లి కావడానికి ముందు, చాలామందిలాగే ఇలియానా కూడా తన స్నేహితులను సంప్రదించింది. 'ప్రసవం తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? తల్లిగా ఎలా సిద్ధం కావాలి?' అని వివరాలు అడిగి తెలుసుకుంది. ఆమె స్నేహితురాలు "తల్లిపాలు ఇవ్వడం చాలా కష్టం. అది నొప్పిగా అనిపించవచ్చు. కానీ అదే సమయంలో అది ఎంతో అందమైన అనుభవం" అని చెప్పింది. అయితే, ఆ నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుందో తనకు అప్పుడు తెలియదని ఇలియానా చెప్పింది. "అంత నొప్పి ఉంటుందని నేను అస్సలు ఊహించలేద...