భారతదేశం, జనవరి 12 -- మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానం కేవలం వెండితెర అద్భుతం మాత్రమే కాదు, అది ఒక గొప్ప 'బిజినెస్ కేస్ స్టడీ'! ఎలాంటి బ్యాక్​గ్రౌండ్​ లేకుండా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి, సున్నా నుంచి కోట్ల సామ్రాజ్యాన్ని అధిపతిగా ఎదిగిన ఆయన ప్రయాణంలో ప్రతి ఎంట్రప్రెన్యూర్‌కు సరిపడా పాఠాలు ఎన్నో ఉన్నాయి. అందుకే, 'మన శంకర వరప్రసాద్​' జీవితం నుంచి పవర్‌ఫుల్ బిజినెస్​ పాఠాలు మీకోసం..

1. రీ-ఇన్వెన్షన్: మార్కెట్ ట్రెండ్‌ను ముందే పసిగట్టడం-

వ్యాపారంలో మొట్టమొదటి సూత్రం - మార్పును ఆహ్వానించడం! చిరంజీవి వచ్చిన సమయంలో తెలుగు సినిమా అంటే కేవలం మాటలు, పాటలు. కానీ ఆయన 'బ్రేక్ డ్యాన్స్', 'మార్షల్ ఆర్ట్స్', 'స్టైలిష్ ఫైట్స్'ను పరిచయం చేశారు.

మీ ప్రొడక్ట్ లేదా సర్వీస్ మిగతా వాటికన్నా భిన్నంగా లేకపోతే, మీరు రేసులో నిలబడలేరు. ఎప్పటికప్పుడు కొత్తదనాన...