భారతదేశం, జూలై 29 -- స్పష్టి ఫర్టిలిటీ సెంటర్‌ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకుల అరాచకాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడవుతున్నాయి. దర్యాప్తులో భాగంగా సృష్టి క్లీనిక్ నుంచి ఐవీఎఫ్, సరోగసీ కేసుల రికార్డులను స్వాధీనం చేసుకున్నారు నార్త్ జోన్ గోపాలపురం పోలీసులు. సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో, రైల్వే స్టేషన్ ఫుట్ పాత్‌లపై ఉండే బిచ్చగాళ్ల నుంచి వీర్యం సేకరించినట్టుగా తెలుస్తోంది.

వీర్యం ఇచ్చేందుకు బిచ్చగాళ్లకు బీరు, బిర్యానీ ఆఫర్ చేసేవారు. అంతేకాదు.. వీర్యం తీసుకునేముందు వారికి పోర్న్ చూపించేవారని తెలుస్తోంది. ఇక సృష్టికి వచ్చిన దంపతుల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. వారి వివరాల ఆధారంగా కాల్స్ చేస్తున్నారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్‌కు హైదరాబాద్‌లోనే కాదు.. ఇతర రాష్ట్రాల్లోన...