Hyderabad, సెప్టెంబర్ 19 -- తెలుగులో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ. బిచ్చగాడు, బిచ్చగాడు 2 సినిమాలతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న వరుస సినిమాలతో అదరగొడుతున్నారు. తాజాగా విజయ్ ఆంటోనీ నటించిన సినిమా భద్రకాళి.

పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన భద్రకాళి సినిమాకు అరుణ్ ప్రభు దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియాతో కలిసి రిలీజ్ చేశారు. ఇవాళ (సెప్టెంబర్ 19) భద్రకాళి రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో విజయ్ ఆంటోనీ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.

-నేను అరుణ్ గారితో ఒక సినిమా చేయాలని ముందే డిసైడ్ అయ్యాను. ఆయనకి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయన చెప్పిన తర్వాత కథ అద్భుతంగా నచ్చింది. అయితే ఆయన ప్రీవియస్ కంటే బిగ్ బడ్జెట్ కథ చె...