భారతదేశం, జూన్ 16 -- శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న, జిమ్ సర్భ్ తదితరులు నటించిన 'కుబేర' ట్రైలర్‌ను ఆదివారం (జూన్ 15) రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమాజంలోని ధనిక, పేద వర్గాలకు మధ్య ఉన్న డిఫరెన్స్.. మనీ పవర్ చుట్టూ కుబేర సినిమా సాగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ ట్రైలర్ తో మూవీపై అంచనాలు మరింత పెరిగాయి.

కుబేర ట్రైలర్ ధనుష్‌తో ప్రారంభమవుతుంది. అతను ఒక బిచ్చగాడి క్యారెక్టర్ చేశారు. కోటాను కోట్ల విలువ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. చరిత్ర చెబుతున్న ప్రకారం ఈ దేశంలో నీతి, న్యాయం కాదు డబ్బు, పలుకుబడి పనిచేస్తాయని చెప్పే నాగార్జున పవర్ ఫుల్ రిచ్ పర్సన్ గా కనిపించారు. ధనుష్‌కు అండగానే నాగార్జున ఉన్నప్పటికీ దాని వెనుక ఏదో కారణం...