భారతదేశం, మే 20 -- మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావుకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు పంపింది. కేసీఆర్‌తో పాటు హరీష్ రావు, ఈటెల రాజేందర్‌కు కూడా నోటీసులు ఇచ్చారు. జూన్ 5వ తేదీ లోగా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేశారు హరీష్ రావు. అలాగే ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశారు.

జస్టిస్ ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన న్యాయ విచారణ కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, నిర్మాణ లోపాలు, పర్యావరణ నష్టం వంటి ఆరోపణలపై ఈ కమిషన్ విచారణ జరుపుతుంది. ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని, కాంట్రాక్టర్లకు అక్రమంగా లాభాలు చేకూర్చారనే ఆరోపణలు ఉన్నాయి.

ప్రాజెక్టులో పలు నిర్మాణ లోపాలు ఉన్నాయని, వరదల సమయంలో పంప...