భారతదేశం, అక్టోబర్ 12 -- బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ మరింత రసవత్తరంగా మారింది. ఇది రణరంగమే అంటు చెప్తున్న బిగ్ బాస్ ఇవాళ వైల్డ్ కార్డు ఎంట్రీలతో నిజంగానే హౌస్ ను యుద్ధ భూమిగా మార్చాడు. బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లోకి ఏడుగురు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు. వీళ్లు ఎవరో చూసేయండి.

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో ఆదివారం (అక్టోబర్ 12) ఫస్ట్ వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య మోక్ష హౌస్ లోకి అడుగుపెట్టింది. సోషల్ మీడియా పాపులారిటీ, పికిల్స్ బిజినెస్, నాన్న చనిపోవడం, ట్రోల్స్ ఇలా తన బ్యాక్ గ్రౌండ్ ఏవీ ప్రదర్శించారు. లగ్జరీ ఫుడ్ పవర్ ను వాడి ఎప్పుడైనా ఇష్టమైనా ఫుడ్ తినొచ్చని రమ్యకు పవర్ స్టోన్ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. రమ్య రాగానే రచ్చ లేపుతుంది. ఓవరాక్టింగ్ శ్రీజ, సెల్ఫిష్ డీమన్, సేఫ్ గేమ్ భరణి, మ్యానిపులేటర్ రాము, ఫేక్ దివ్య...