Hyderabad, అక్టోబర్ 13 -- బిగ్ బాస్ 9 తెలుగు సీజన్‌లో ఈ వారం పెద్ద స్ట్రోక్ ఇచ్చారు బీబీ టీమ్. గత కొద్ది వారాలుగా డబుల్ ఎలిమినేషన్ అని ప్రచారం జరిగింది. కానీ, ఐదో వారం మాత్రం సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందనే టాక్ నడిచింది. డబుల్ ఎలిమినేషన్‌పై ఎలాంటి టాక్ రాలేదు. ఈ క్రమంలో సడెన్‌గా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది.

దాంతో బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ నుంచి ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయారు. వారిలో ఆడియెన్స్ నుంచి ఓటింగ్ తక్కువ రావడంతో ఫ్లోరా సైని అలియాస్ ఆశ సైని ఎలిమినేట్ అయింది. ఆమె తర్వాత బ్లాక్ స్టార్స్ ఉన్న వారికి టాస్క్ ఆడించారు. చివరిగా సుమన్ శెట్టి, శ్రీజ దమ్ము మిగిలారు.

వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ కంటెస్టెంట్లతో ఈ ఇద్దరికి ఓట్లు వేయించారు. ఈ టాస్క్‌లో సుమన్ శెట్టికి ఎక్కువ ఓట్లు పడటంతో దమ్ము శ్రీజ ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. హౌజ్...