భారతదేశం, డిసెంబర్ 15 -- బిగ్ బాస్ 9 తెలుగు క్లైమ్యాక్స్ కు చేరుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షో మొత్తానికి 107 రోజుల తర్వాత గ్రాండ్ ఫినాలేకు సిద్ధమైంది. మరో ఆరు రోజుల్లోనే అంటూ ఈ విషయాన్ని స్టార్ మా ఛానెల్ సోమవారం (డిసెంబర్ 15) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. దీంతో ఈసారి విజేత ఎవరో అని ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

బిగ్ బాస్ 9 తెలుగు గ్రాండ్ ఫినాలేలో హౌస్‌లో ఉన్న చివరి ఐదుగురు కంటెస్టెంట్లు టైటిల్ కోసం పోటీ పడబోతున్నారు. ఈ ఫినాలే విషయాన్ని స్టార్ మా తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. "టాప్ 5 ఫేస్ ఆఫ్.. ఎపిక్ గ్రాండ్ ఫినాలే కోసం సిద్ధంగా ఉండండి. బిగ్ బాస్ తెలుగు 9 సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు, శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు స్టార్ మాలో.. జియోహాట్‌స్టార్ లో 24 గంటలూ స్ట్రీమింగ్" అన...