Hyderabad, ఆగస్టు 13 -- బిగ్ బాస్ తెలుగు సీజన్ 9ని అంతకుమించి అనేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటివరకు ఏ సీజన్‌లో రాని విధంగా కామన్ కంటెస్టెంట్స్‌ను సెలెక్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే మొదటిసారిగా ఓపెనింగ్‌కు ముందే ప్రీ షో జరగనుంది. అదే బిగ్ బాస్ అగ్ని పరీక్ష.

బిగ్ బాస్ తెలుగు 9లో కామన్ ఆడియెన్స్‌ను కంటెస్టెంట్లను పంపించేందుకు నిర్వహించేదే ఈ అగ్ని పరీక్ష. బిగ్ బాస్ 9 తెలుగు అగ్ని పరీక్ష కోసం మొత్తంగా 100 మందికి పైగా అప్లికేషన్స్ పెట్టుకోగా.. వారిలో వడబోతలు చేసి 15 మందిని సెలెక్ట్ చేశారు. ఈ 15 మందికి అసలైన అగ్ని పరీక్ష టాస్క్‌ను పెట్టనున్నారు బిగ్ బాస్ మేకర్స్.

అయితే, ఈ బిగ్ బాస్ తెలుగు 9 అగ్ని పరీక్ష కోసం ముగ్గురు జడ్జ్‌లను నియమించారు. వారే బిగ్ బాస్ పాత సీజన్స్ విన్నర్స్ అయిన అభిజీత్, బిందు మాధవి, హీరో నవదీప్. నిజాన...