భారతదేశం, అక్టోబర్ 7 -- బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ నిజంగానే రణరణంగా మారబోతుంది. ఫైర్ స్టార్మ్ ఎంటర్ కానుంది. హౌస్ లోకి వైల్డ్ కార్డులు అనే డేంజర్ రాబోతుందని కంటెస్టెంట్లకు బిగ్ బాస్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. వాళ్ల వస్తే డేంజర్ జోన్లో ఉన్నవాళ్లకు ఇబ్బందులు తప్పవన్నాడు. మొత్తానికి ఈ వారం బిగ్ బాస్ లో వైల్డ్ కార్డు ముప్పు నుంచి తప్పించుకునేందుకు కంటెస్టెంట్లు కష్టపడనున్నారు.

ఇప్పటికే బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇక ఆ జోరు మరింత పెరగనుంది. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తయ్యాయి. శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, మాస్క్ మ్యాన్ హరీష్ ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు అయిదో వారంలోకి అడుగుపెట్టారు కంటెస్టెంట్లు. వాళ్లకు వైల్డ్ కార్డు రూపంలో ఫైర్ స్టార్మ్ ఎదురు కానుందని బిగ్ బాస్ చెప్పాడు.

బిగ్ బాస్ 9 తెలుగులో ఇవాళ (అక్టోబర్ 7) రిలీజ...