భారతదేశం, అక్టోబర్ 8 -- బిగ్ బాస్ 9 తెలుగులో అయిదో వారం టాస్క్ లు హోరాహరీగా సాగుతున్నాయి. డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లు బయటకు వచ్చేందుకు గట్టిగానే ట్రై చేస్తున్నారు. బిగ్ బాస్ 9 తెలుగు అయిదో వారం ఇమ్మాన్యుయేల్, రాము రాథోడ్ మినహా అందరూ నామినేషన్లలో ఉన్నారు. ఓట్ల కోసం ఎవరికి తగ్గ ఆటతీరు వాళ్లు చూపిస్తున్నారు. మరి ప్రస్తుతం ఓటింగ్ ప్రకారం డేంజర్ జోన్లో ఎవరున్నారో చూసేద్దాం.

బిగ్ బాస్ 9 తెలుగులో అయిదో వారం నామినేషన్లలో 10 మంది కంటెస్టెంట్లున్నారు. వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారని వార్నింగ్ ఇచ్చిన బిగ్ బాస్ డైరెక్ట్ గా 10 మందిని నామినేట్ చేశాడు. ఇందులో రీతు చౌదరి, డీమాన్ పవన్, తనుజ, కల్యాణ్, ఫ్లోరా సైని, సంజన గల్రానీ, సుమన్ శెట్టి, శ్రీజ, భరణి, దివ్య నిఖిత ఉన్నారు. కెప్టెన్ కావడం వల్ల రాము రాథోడ్ ను, గోల్డెన్ స్టార్ ఇమ్యునిటీ ఉండటంతో ఇమ్మాన్య...