భారతదేశం, డిసెంబర్ 8 -- ఇది చదరంగం కాదు రణరంగమంటూ స్టార్ట్ అయిన బిగ్ బాస్ 9 సీజన్ ముగింపుకు చేరువవుతోంది. ఇంకా రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఫినాలే వీక్ కు ముందు కూడా బిగ్ బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా అయితే బిగ్ బాస్ ఫినాలే వారానికి అయిదుగురు కంటెస్టెంట్లు అర్హత సాధిస్తారు. కానీ బిగ్ బాస్ 9లో మాత్రం ఓ ట్విస్ట్ ఉండబోతుంది.

అవును.. మీరు చదివింది నిజమేనని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సారి బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో టాప్-5 కాదు టాప్-6 ఉండబోతున్నారని తెలిసింది. అంటే సీజన్ 6 లాగే సీజన్ 9లోనూ ఫినాలే వీక్ కు ఆరుగురు కంటెస్టెంట్లకు ఛాన్స్ ఇస్తారని టాక్. అయితే ఈ ఆరుగురిలో ఒకరిని వచ్చే వారం మిడ్ వీక్ లో ఎలిమినేట్ చేస్తారని తెలుస్తుంది. అప్పుడు గ్రాండ్ ఫినాలేకు అయిదుగురు కంటెస్టెంట్లే ఉంటారు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచ...