భారతదేశం, డిసెంబర్ 15 -- ఊహించని ఎలిమినేషన్స్, అనూహ్యమైన ట్విస్టులు, గొడవలు, అరుపులు, సోల్జర్ కార్డ్స్, సింపతీ గేమ్స్, ఏడుపులు, కన్నీళ్లు, టాస్క్‌లతో బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ బాగానే సాగింది. ఇక మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ముగిసిపోనుంది. అందుకు సుమారుగా ఇంకో వారం ఉందనుకోవచ్చు.

మొన్నటి వరకు బిగ్ బాస్ హౌజ్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉండేవారు. వారిలో మొదటి ఫైనలిస్ట్‌గా కల్యాణ్ పడాల నిలిస్తే రెండో ఫైనలిస్ట్‌గా స్థానం సంపాదించుకుంది. ఇకపోతే గతవారం అంటే బిగ్ బాస్ 9 తెలుగు 14వ వారం డబుల్ ఎలిమినేషన్ చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

శనివారం నాటి ఎపిసోడ్‌లో కమెడియన్ సుమన్ శెట్టి ఎలిమినేట్ అవ్వగా.. ఆదివారం నాడు సీరియల్ నటుడు భరణి శంకర్ రెండోసారి ఎలిమినేషన్‌కు గురయ్యాడు. బిగ్ బాస్ హౌజ్‌లో ఐదుగురు కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. వారిలో ట...