Hyderabad, సెప్టెంబర్ 15 -- బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ జోరుగా సాగుతోంది. బిగ్ బాస్ 9 తెలుగు నుంచి మొదటి వారం కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ నామినేట్ అయిపోయింది. ఇక సోమవారం అంటే బిగ్ బాస్ తెలుగు 9 సెప్టెంబర్ 15 ఎపిసోడ్‌లో రెండో వారం నామినేషన్స్ జరగనున్నాయి. వీటితో పాటు హౌజ్‌లో కంటెస్టెంట్ల మధ్య అల్లరి, కామెడీ, సరదా వేశాలు జరగనున్నాయి.

దీనికి సంబంధించిన బిగ్ బాస్ తెలుగు 9 ఈరోజు ఎపిసోడ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. అందులో రీతూ చౌదరి, డీమోన్ పవన్ ఇద్దరు బయట కూర్చుని తింటుంటారు. "అగో అక్కడ చూడు. ఆ కపుల్‌ని చూడు" అని ఇమ్మాన్యుయెల్‌కు తనూజ గౌడ చెప్పింది. దాంతో రీతూ చౌదరికి వెళ్లిన ఇమ్మాన్యుయెల్ "రీతూని మిస్ అవుతున్నా అబ్బా నేను. ఈ మధ్య నాతో సరిగా తిరగట్లేదు" అని కామెడీ చేశాడు.

"నా పక్కన ఉన్నట్లు అనిపించట్లేదు" అని తనూజ మాటలు అందించింది. "నా పక్కన...