భారతదేశం, సెప్టెంబర్ 7 -- బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 షురూ అయింది. ఆదివారం (సెప్టెంబర్ 7)న కొత్త సీజన్ కు తెరలేచింది. హోస్ట్ గా నాగార్జున మరోసారి హౌస్ ను చూపెట్టారు. సెలబ్రిటీ, కామనర్స్ కు స్వాగతం పలికారు. మొత్తం 15 మంది హౌస్ లోకి వెళ్లారు. వాళ్లు ఎవరు? వాళ్ల బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసుకుందాం. ఇందులో 9 మంది సెలబ్రిటీలు, 6 కామనర్స్ ఉన్నారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఫస్ట్ సెలబ్రిటీగా సీరియల్ నటి తనూజ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ముద్ద మందారం సీరియల్ తో అడుగుపెట్టింది. అంతకుముందు కన్నడలో హీరోయిన్ గా చేసింది.

బిగ్ బాస్ హౌస్ లోకి రెండో సెలబ్రిటీగా ఆషా సైనీ ఎంటరైంది. ప్రేమ కోసం సినిమాతో తెలుగులో అడుగుపెట్టింది ఆషా. ఆమె అసలు పేరు ఫ్లోరా సైనీ. నరసింహా నాయుడు, నువ్వు నాకు నచ్చావ్ సినిమాల్లో చేసింది. బాలయ్యతో 'లక్స్ పాప' అంటూ స్పెషల్ సాంగ్ తో అదరగొట్ట...