భారతదేశం, డిసెంబర్ 8 -- మూడు నెలలకు పైగా సాగిన డ్రామా, పోరాటాలు, హృదయ విదారక సంఘటనలు, వినోదాల తర్వాత గౌరవ్ ఖన్నా బిగ్ బాస్ 19 విజేతగా అవతరించాడు. సల్మాన్ ఖాన్ ఆదివారం (డిసెంబర్ 7) రాత్రి హోస్ట్ చేసిన గ్రాండ్ ఫినాలే.. గౌరవ్, ఫర్హానా భట్ స్టేజిపై జీవితాన్ని మార్చేసే ప్రకటన కోసం ఎదురుచూస్తున్నప్పుడు ఉత్కంఠభరితమైన క్షణాలను చూసింది. చివరకు గౌరవ్ ఖన్నా టైటిల్ సొంతం చేసుకున్నాడు.

బిగ్ బాస్ 19 హిందీ సీజన్ లో గౌరవ్ ఖన్నా విన్నర్ గా నిలిచాడు. ట్రోఫీతో పాటు ఈ నటుడు రూ. 50 లక్షల ప్రైజ్ మనీని ఇంటికి తీసుకెళ్లాడు. అంతే కాకుండా కారు కూడా సొంతం చేసుకున్నాడు. గౌరవ్ ఖన్నా ఇప్పటికే సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ టైటిల్ ను కూడా సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ ట్రోఫీని ఖాతాలో వేసుకున్నాడు. అతను ఫర్హానా భట్, తన్యా మిట్టల్, ప్రణీత్ మోర్, అమాన్ మల్లిక్ లను ఓడించి...