భారతదేశం, డిసెంబర్ 21 -- బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు సీజన్-9' గ్రాండ్ ఫినాలే ఆదివారం (డిసెంబర్ 21) రాత్రి అట్టహాసంగా ముగిసింది. గత 15 వారాలుగా కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిన ఈ షో విజేతగా సామాన్య కంటెస్టెంట్, మాజీ సైనికుడు కల్యాణ్ పడాల నిలిచాడు.

ఆరంభంలో అంచనాలు లేకపోయినా, తనదైన శైలిలో ఆడుతూ 'మొదటి ఫైనలిస్ట్'గా రికార్డు సృష్టించిన కల్యాణ్ చివరికి టైటిల్ ఎగరేసుకుపోయి 'జై జవాన్' అనిపించుకున్నారు. రన్నరప్‌గా సీరియల్ హీరోయిన్ తనూజ పుట్టస్వామి నిలిచింది.

టాప్-3 కంటెస్టెంట్లుగా కల్యాణ్ పడాల, తనూజ, డీమాన్ పవన్ మిగిలిన సమయంలో బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. మాస్ మహారాజా రవితేజ హౌస్‌లోకి అడుగుపెట్టి రూ. 15 లక్షల సూట్‌కేస్ ఆఫర్ ప్రకటించారు. చాలా సేపు ఆలోచించిన తర్వాత డిమాన్ పవన్ ఆ మొత్తాన్ని తీసుకుని రేసు నుంచి తప్పుకు...