భారతదేశం, నవంబర్ 5 -- బిగ్ బాస్ తెలుగు నుంచి మొదటి నుంచి ఫాలో అవుతున్న వాళ్లకు సీజన్ 4లో ఘోస్ట్ రూమ్ లో అఖిల్, సోహైల్ చేసిన సందడి గుర్తే ఉంటుంది. దెయ్యాలకు భయపడుతూ వాళ్లు పండించిన కామెడీ బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోని హైలైట్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు సీజన్ 9లోనూ మరోసారి ఘోస్ట్ రూమ్ తో కామెడీ పండించే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. బిగ్ బాస్ 9 తెలుగు తొమ్మిదో వారం టాస్క్ ఇదే.

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ తొమ్మిదో వారం ఎంటర్ టైన్మెంట్ డోస్ పెంచేందుకు ట్రై చేస్తున్నాడు బిగ్ బాస్. ఈ వారం టాస్క్ లో భాగంగా ఘోస్ట్ రూమ్ సెట్ చేసి అందులో కొన్ని ఐటెమ్స్ పెట్టి వాటిని టచ్ చేసి, స్మెల్ చూసి గెస్ చేయాలనేది టాస్క్. ఇందులో భాగంగా లోపలికి వెళ్లిన తనుజ భయంతో వణికిపోయింది. లోపల దెయ్యాల మాస్కులో ఉన్న మనుషులు, బొమ్మలు తెగ భయపెట్టాయి. దీంతో బయటకు ఏడుస్తూ వచ్చింద...