Hyderabad, సెప్టెంబర్ 22 -- బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌లో రెండో వారం ముగిసింది. సెకండ్ వీక్‌లో బిగ్ బాస్ 9 తెలుగు నుంచి మనీష్ మర్యాద ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయాడు. దాంతో బిగ్ బాస్ హౌజ్‌లో 13 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. వారిలో మూడో వారం మరొకరు ఎలిమినేట్ అయ్యేందుకు ఈ వారం బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించారు.

దీనికి సంబంధించిన ఇవాల్టీ (సెప్టెంబర్ 22) బిగ్ బాస్ తెలుగు 9 ఎపిసోడ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. అయితే, ఇప్పుడు హౌజ్‌లో సెలబ్రిటీలుగా వచ్చిన కంటెస్టెంట్స్ ఓనర్స్‌గా, కామనర్స్‌గా వచ్చిన సభ్యులు టెనెంట్స్‌గా ఉన్నారు. ఇంతకుముందు ఇది రివర్స్‌లో ఉండగా శనివారం నాటి ఎపిసోడ్‌లో దీన్ని హోస్ట్ నాగార్జున మార్చాడు.

ఇప్పుడు ఓనర్స్-టెనెంట్స్‌కు ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించాడు బిగ్ బాస్. "బిగ్ బాస్ సీజన్ 9 మూడో వారం నామినేషన్స్ చ...