భారతదేశం, జనవరి 2 -- బిగ్ బాస్ సీజన్ 19లో తనదైన ముద్ర వేసి 3వ రన్నరప్‌గా నిలిచిన బ్యూటి తాన్య మిట్టల్ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నప్పుడు తాన్య మిట్టల్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.

ముఖ్యంగా 'నాకు 150 మంది బాడీగార్డ్స్ ఉన్నారు', 'బక్లావా తినడానికే దుబాయ్ వెళ్తాను' వంటి తాన్యా మిట్టల్ మాటలు నెటిజన్లకు ఆశ్చర్యం కలిగించాయి. అయితే, ఇప్పుడు బిగ్ బాస్ ప్రయాణం ముగిశాక, తనపై వస్తున్న ఆ వార్తలపై తాన్య గ్వాలియర్‌లో స్పందించారు.

ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫ్యాక్టరీని చూపిస్తూ తాన్య మిట్టల్ అసలు విషయం వెల్లడించారు. "నాకు 150 మంది బాడీగార్డ్స్ ఉన్నారని నేను ఎక్కడా చెప్పలేదు. ఇంటర్నెట్‌లో వెతికినా అలాంటి వీడియో మీకు ఎక్కడా దొరకదు. అదంతా సృష్టించిన ప్రచారం మాత్రమే" అ...