భారతదేశం, డిసెంబర్ 14 -- బిగ్ బాస్ 9 తెలుగు తుది ఘట్టానికి చేరుకుంది. మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలే నిర్వహించి టైటిల్ విన్నర్‌ను ప్రకటించనున్నారు. అయితే, ఈ క్రమంలో టాప్ 5 ఫైనలిస్ట్స్, ప్రతి వారం ఎలిమినేషన్ వంటి వివరాలు ఆసక్తిగా మారాయి.

ఈసారి గ్రాండ్ ఫినాలేకు టాప్ 5 లేదా టాప్ 6 కంటెస్టెంట్స్ వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం హౌజ్‌లో తనూజ గౌడ, డిమాన్ పవన్, ఇమ్మాన్యూయెల్, కల్యాణ్ పడాల, భరణి శంకర్, సంజన గల్రాని, సుమన్ శెట్టి ఏడుగురు ఉన్నారు. వీరిలో నుంచి బిగ్ బాస్ 9 తెలుగు 14వ వారం డబుల్ ఎలిమినేషన్ జరగనుంది.

అయితే, ఈ ఏడుగురిలో అత్యధిక ఓటింగ్‌తో తనూజ, కల్యాణ్, ఇమ్మాన్యూయెల్, డిమాన్ పవన్ టాప్ 4లో ఉన్నారు. వీరి తర్వాత భరణి శంకర్, సంజన, సుమన్ శెట్టి వీరు డేంజర్ జోన్‌లో ఉన్నారు. కానీ, ఈపాటికే బిగ్ బాస్ నుంచి ఈ వారం సు...