భారతదేశం, డిసెంబర్ 15 -- బిగ్ బాస్ 9 తెలుగు సీజన్‌కు మరికొన్ని రోజుల్లో ఎండ్ కార్డ్ పడనుంది. మహా అయితే ఇంకో వారంలో బిగ్ బాస్ తెలుగు 9 టైటిల్ విన్నర్‌ను ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, బిగ్ బాస్ హౌజ్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉండగా.. వారిలో నుంచి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కింద ఇద్దరు ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు.

అంటే, బిగ్ బాస్ 9 తెలుగు 14వ వారం డబుల్ ఎలిమినేషన్ చోటు చేసుకుంది. మొదటగా శనివారం (డిసెంబర్ 13) నాటి ఎపిసోడ్‌లో కమెడియన్ సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఆదివారం (డిసెంబర్ 14) నాటి ఎపిసోడ్‌లో భరణి శంకర్ ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయాడు.

అయితే, భరణి శంకర్ బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అవడం ఇది రెండోసారి. ఇదివరకు 6వ వారంలో బిగ్ బాస్ తెలుగు 9 నుంచి భరణి శంకర్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అప్పుడు భరణికి ఉన్న క్రేజ్, సోషల్ మీడియా...