Hyderabad, సెప్టెంబర్ 21 -- బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ మంచి జోష్‌తో సాగుతోంది. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు అంటూ మొదలైన బిగ్ బాస్ 8 తెలుగు రెండో వారానికి చేరుకుంది. ఓనర్స్, టెనెంట్స్‌గా కంటెస్టెంట్స్ పాల్గొంటున్న బిగ్ బాస్ తెలుగు 9 రెండో వారం మరొకరు ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయారు.

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఈ వారం నామినేషన్స్‌లో మొత్తంగా ఏడుగురు నామినేట్ అయ్యారు. వారిలో భరణి శంకర్, హరిత హరీష్, మనీష్ మర్యాద, ప్రియా శెట్టి, ఫ్లోరా సైని, డీమోన్ పవన్, సుమన్ శెట్టి ఉన్నారు. వీరికి నామినేషన్స్ అనంతరం ఓటింగ్ నిర్వహించారు.

అలా నిర్వహించిన బిగ్ బాస్ 9 తెలుగు రెండో వారం ఓటింగ్ ఫలితాల్లో అత్యధికంగా సుమన్ శెట్టి ఓట్లు పడగా చివరగా ఫ్లోరా సైని, మనీష్ మర్యాద నిలిచారు. బిగ్ బాస్ తెలుగు 9 రెండో వారం ఎలిమినేషన్ ప్రక్రియ వీరిద్దరి మధ్య సాగింది. చివరిగా ఫ్ల...