భారతదేశం, డిసెంబర్ 1 -- బిగ్ బాస్ 9 తెలుగు చివరి అంకానికి చేరుకుంది. మహా అయితే మరో రెండు, మూడు వారాలు మాత్రమే బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ కొనసాగనుంది. అంటే మరో రెండు వారాల్లో బిగ్ బాస్ తెలుగు 9 టైటిల్ విన్నర్‌ను ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే, గత వారం నో ఎలిమినేషన్ కారణంగా ఎవరు బిగ్ బాస్ హౌజ్ నుంచి ఇంటికి వెళ్లలేదు.

కానీ, ఈ వారం ఎలిమినేషన్ చోటు చేసుకుంది. అందరూ ఊహించినట్లుగానే బిగ్ బాస్ తెలుగు 9 పన్నెండో వారం దివ్య నిఖిత ఎలిమినేట్ అయింది. గత వారమే ఎలిమినేట్ కావాల్సిన దివ్వ సీరియల్ హీరోయిన్ తనూజ గౌడతో గొడవ కారణంగా సేఫ్ అయింది. కానీ, ఈ వారం మాత్రం దివ్యను ఆడియెన్స్ ఎలిమినేట్ చేశారు.

బిగ్ బాస్ 9 తెలుగు పన్నెండో వారం నామినేషన్స్‌లో 8 మంది ఉన్నారు. వీరికి నిర్వహించిన బిగ్ బాస్ ఓటింగ్‌లో టాప్ 1, 2 స్థానాల్లో కల్యాణ్, తనూజ ప్లేసులు మారుతూ కొనసాగుతూ...