భారతదేశం, డిసెంబర్ 7 -- ఊహించని ఎలిమినేషన్స్, షాకింగ్ ట్విస్ట్స్, పార్శాలిటీగా చూడటం వంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో ఈ బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ కూడా సాగుతోంది. నాగార్జున హోస్ట్‌గా చేస్తున్న బిగ్ బాస్ 9 తెలుగులో ఈ వారం కూడా షాకింగ్ ఎలిమినేషన్ చోటు చేసుకుంది.

నిన్నటి (డిసెంబర్ 6) మధ్యాహ్నాం వరకు కమెడియన్ సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతాడని తెగ ప్రచారం జరిగింది. అంతేకాకుండా డబుల్ ఎలిమినేషన్ కూడా ఉంటుందని ఇన్‌సైడ్ నుంచి టాక్ వస్తున్నట్లుగా లీక్స్ వచ్చాయి. కానీ, అనూహ్యంగా జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి ఎలిమినేట్ అయింది.

అలాగే, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కాకుండా కేవలం సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే ఉంది. ఇక రీతూ చౌదరి ఎలిమినేషన్ ఎపిసోడ్‌ను ఇవాళ (డిసెంబర్ 7) స్టార్ మా ఛానెల్‌, జియో హాట్‌స్టార్ ఓటీటీలో ప్రసారం చేయనున్నారు. అయితే, ఈ ప్రక్రియకు సంబంధించిన షూట...