భారతదేశం, అక్టోబర్ 26 -- బిగ్ బాస్ 9 తెలుగు జోరుగా సాగిపోతుంది. ఇప్పుడు ఏడో వారం కూడా పూర్తి కానుంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ నేటితో 7వ వారం పూర్తి కానుంది. ఇక బిగ్ బాస్ అన్నాక ప్రతివారం ఒకరి ఎలిమినేషన్ కచ్చితంగా ఉంటుందన్న విషయం తెలిసిందే.

ఇలా ఇప్పటికే శ్రేష్టి వర్మ, మనీష్ మర్యాద, ప్రియా శెట్టి, హరిత హరీష్, ఫ్లోరా సైని, శ్రీజ దమ్ము, భరణి శంకర్ ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు. ఈ మధ్యలోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా కొత్త కంటెస్టెంట్స్ వచ్చారు. ప్రస్తుతం హౌజ్‌లో 15 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారికి ఏడో వారం నామినేషన్స్ నిర్వహించారు.

అరుపులు, కేకలతో సాగిన బిగ్ బాస్ తెలుగు 9 ఏడో వారం నామినేషన్స్‌లో 8 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. ఈ వారం రాము రాథోడ్, తనూజ పుట్టస్వామి, కల్యాణ్ పడాల, సంజన గల్రానీ, రమ్య మోక్ష, రీతూ చౌద...