భారతదేశం, డిసెంబర్ 21 -- తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో 'బిగ్ బాస్' సీజన్ 9 ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. 105 రోజుల పాటు సాగిన ఈ రణరంగంలో ఎందరో సెలబ్రిటీలను దాటుకుని, ఒక సామాన్యుడిగా హౌస్‌లోకి అడుగుపెట్టిన కల్యాణ్ పడాల (Kalyan Padala) టైటిల్ విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆదివారం రాత్రి జరిగిన గ్రాండ్ ఫినాలేలో హోస్ట్ అక్కినేని నాగార్జున సమక్షంలో కల్యాణ్ పడాల బిగ్ బాస్ ట్రోఫీని అందుకున్నారు.

బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ప్రారంభంలో ఒక ఆర్మీ సోల్జర్‌గా, సామాన్యుల కోటాలో ఎంట్రీ ఇచ్చిన కల్యాణ్ మొదటి నుంచి తన ఆట తీరుతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. టాస్కుల్లో చూపిన తెగువ, తోటి కంటెస్టెంట్లతో వ్యవహరించిన తీరు ఆయనకు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ బేస్‌ను తెచ్చిపెట్టాయి.

ముఖ్యంగా ఫైనల్ రేసులో తనూజ, ఇమ్మాన్యుయేల్ వంటి బలమైన సెలబ్...