భారతదేశం, డిసెంబర్ 21 -- కల్యాణ్ పడాల బిగ్ బాస్ తెలుగు 9 విజేతగా నిలిచాడు. రన్నరప్‌గా తనూజ గౌడ సరిపెట్టుకుంది. ఎంతోమంది తనూజ టైటిల్ కొడుతుందని టీవీ సీజన్‌కు మొదటి లేడి విన్నర్ అవుతుందని ఆశించారు. కానీ, మళ్లీ లేడి విన్నర్ మిస్ అయి సామాన్యుడికి ట్రోఫీ చేరింది.

బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ విజేతగా కల్యాణ్ పడాల నిలిచాడు. తనూజ పుట్టస్వామి రన్నరప్‌గా నిలిచింది. కల్యాణ్‌కు హోస్ట్ నాగార్జున ట్రోఫీ అందించారు. తనకు ధైర్యం ఇచ్చింది తనూజ అని ఈ సందర్భంగా కల్యాణ్ తెలిపాడు.

డీమాన్ పవన్ రూ. 15 లక్షల సూట్‌కేస్ తీసుకోవడం బిగ్ బాస్ ప్రైజ్ మనీ తగ్గిపోయిందని హోస్ట్ నాగార్జున తెలిపారు. ఇప్పుడు బిగ్ బాస్ టైటిల్ విన్నర్‌కు వచ్చేది కేవలం రూ. 35 లక్షలు మాత్రమే అని చెప్పారు.

స్టైజీపైన పవన్‌ను తెగ పొగిడారు హోస్ట్ నాగార్జున. తండ్రికి అనారోగ్యం ఉందని తెలిసిన రోజు బాధగా...