భారతదేశం, సెప్టెంబర్ 9 -- పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ వచ్చేసింది. సెప్టెంబర్ 7న బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ ప్రారంభమైంది. ఈ సీజన్ లో 9 మంది సెలబ్రిటీలు, 6 మంది కామనర్స్ ఎంట్రీ ఇచ్చారు. అగ్ని పరీక్ష ద్వారా ఆరుగురు కామనర్స్ ను ఎంపిక చేశారు. మరి బిగ్ బాస్ 9 తెలుగు కంటెస్టెంట్లకు ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారో చూద్దాం.

బిగ్ బాస్ కంటెస్టెంట్లకు రెమ్యునరేషన్ ను ముందే డిసైడ్ చేస్తారు. బిగ్ బాస్ ట్రోఫీ గెలిస్తే వచ్చే డబ్బు కంటే ముందు వారానికి ఇంత అని కంటెస్టెంట్లకు రెమ్యునరేషన్ ఇస్తారు. బిగ్ బాస్ 9 తెలుగులో సీనియర్ సీరియల్ యాక్టర్ భరణి శంకర్ కు అత్యధికంగా వారానికి రూ.3.5 లక్షల రెమ్యునరేషన్ అందుతున్నట్లు తెలిసింది. ఆ తర్వాత ఆషా షైనీకి వారానికి రూ.3 లక్షలు ఇస్తున్నట్లు సమాచారం.

సంజన గల్రానీకి వారానికి రూ.2.75 లక్షలు ఇస్తున్నట్లు ...