భారతదేశం, డిసెంబర్ 21 -- స్టేజీ మీదకు సింగర్ మంగ్లీ ఎంట్రీ ఇచ్చింది. లేటెస్ట్ ట్రెండింగ్ సాంగ్ బాయిలోన బల్లి పలికే పాటపై డ్యాన్స్ పర్ఫామెన్స్‌తో సింగర్ మంగ్లీ ఆకట్టుకుంది.

బిగ్ బాస్ తెలుగు 9 ట్రోఫీని అందరికి నాగార్జున చూపించారు. ఆ తర్వాత ఎక్స్ కంటెస్టెంట్స్‌తో ఎవరు విన్ అవుతారో గెస్ చేయమని నాగార్జున అడిగారు. ఒక్కొక్కరు ఒకరి పేరు చెప్పారు.

బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలే ప్రారంభమైపోయింది. స్టేజీ మీదకు నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. టాప్ 5 ఫైనలిస్టుల తల్లిదండ్రులతో నాగ్ మాట్లాడారు. ఒక్కొక్కరి అభిప్రాయాలు తెలుసుకున్నారు.

'జబర్దస్త్' కమెడియన్‌గా అందరినీ నవ్వించే ఇమ్మాన్యుయేల్.. హౌస్‌లో తనదైన చతురతతో, వినోదాన్ని పంచుతూ టాప్ 5లో చోటు సంపాదించుకున్నారు.

బుల్లితెర ప్రేక్షకులకు 'ముద్ద మందారం' పార్వతిగా సుపరిచితురాలైన తనూజ, తన సహజమైన ఆటతో ఫైనలిస్ట...