భారతదేశం, డిసెంబర్ 21 -- హౌజ్‌లోకి వెళ్లిన నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి ఇద్దరు జబర్దస్త్ ఇమ్మాన్యూయెల్‌ను ఎలిమినేట్ చేసి తీసుకొచ్చారు. టాప్ 4 కంటెస్టెంట్‌గా నిలిచిన ఇమ్మాన్యూయెల్ ఎమోషనల్ అయ్యాడు. అతన్ని నాగార్జున ప్రశంసించారు.

బిగ్ బాస్ స్టేజీ మీదకు నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి ఎంట్రీ ఇచ్చారు. వారి దగ్గరికి రోబో డాగ్ రోగ్‌ను తీసుకొచ్చారు నాగార్జున. టాప్ 4లో ఒకరిని ఎలిమినేట్ చేసేందుకు నవీన్ పోలిశెట్టికి సహాయంగా హౌజ్‌లోకి రోబో డాగ్‌ను పంపించారు.

టాప్ 5 ఫైనలిస్ట్‌గా సంజన గల్రానీ ఎలిమినేట్ అయింది. హీరో శ్రీకాంత్ ద్వారా సంజనను ఎలిమినేట్ చేయించారు.

టాప్ 5 నుంచి ఒకరిని ఎలిమినేట్ చేసి తీసుకురావాలని హీరో శ్రీకాంత్‌కు నాగార్జున చెప్పాడు. ఒక్కొక్కరి పేరు చెబుతూ అందరూ సేఫ్ అన్నాడు శ్రీకాంత్. ఈ క్రమంలో కల్యాణ్ పడాల ఎమోషనల్ అయ్యాడు.

బిగ్ బా...