Hyderabad, సెప్టెంబర్ 7 -- బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ లాంచ్‌కు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఇవాళ (సెప్టెంబర్ 7) సాయంత్రం 7 గంటలకు బిగ్ బాస్ తెలుగు 9 ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన బిగ్ బాస్ 9 తెలుగు గ్రాండ్ లాంచ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. 2 నిమిషాల 29 సెకన్ల నిడివి ఉన్న ఈ ప్రోమో అంతా ఆసక్తికరంగా సాగింది.

"ఊహకందని మార్పులు.. ఊహించని మలుపులు.. డబుల్ హౌజ్‌తో.. డబుల్ జోష్‌తో మీ ముందుకు వచ్చేసింది బిగ్ బాస్ సీజన్ 9" అని నాగార్జున వాయిస్‌తో ప్రోమో ప్రారంభమైంది. సాంగ్‌తో నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. "ఇది కలయా నిజమా అన్నట్లుగా అనపిస్తుంది" అని నాగార్జునతో కామనర్ కంటెస్టెంట్ కల్కి చెప్పింది.

"ఆవిడను గిచ్చయ్యా" అని నాగార్జున అంటే.. అతన్నే గిచ్చిన కల్కి నిజమే అని అంది. నా హార్ట్ అలా రేజ్ అవుతుందని మరో కంటెస్టెంట్ అంటే.. "బిగ్ బాస్ దాలి...