Hyderabad, సెప్టెంబర్ 15 -- బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ప్రారంభమైంది. అప్పుడే ఓ వారం గడిచిపోయి ఒకరు ఎలిమినేట్ అయ్యారు. కొరియోగ్రాఫర్‌, డ్యాన్సర్‌గా పేరు తెచ్చుకున్న శ్రేష్టి వర్మ ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌజ్‌ను వీడి వెళ్లిపోయింది. ఇక ఎప్పటిలాగే మరో వారం ఎవరు ఎలిమినేట్ కావాలని కోరుకుంటున్నారో వారిని నామినేట్ చేసే ప్రక్రియను మొదలు పెట్టాడు బిగ్ బాస్.

బిగ్ బాస్ 9 తెలుగు ఈ వారం నామినేషన్స్ ప్రక్రియకకు సంబంధించిన షూటింగ్ ఆదివారం (సెప్టెంబర్ 14) నిర్వహించారు. కానీ, ఆడియెన్స‌కు మాత్రం సోమవారం (సెప్టెంబర 15) ఎపిసోడ్‌లో నామినేషన్స్ ప్రక్రియ చూపిస్తారు. అయితే, రెండో వారం బిగ్ బాస్ తెలుగు 9 నామినేషన్స్ జోరుగా జరిగినట్లు ఇన్‌సైడ్ టాక్.

ఈ వారం బిగ్ బాస్ 9 తెలుగు నామినేషన్స‌ులో ఆరుగురు ఉన్నట్లు సమాచారం. హౌజ్ మేట్స్ ఒక్కొక్కరు తగిన కారణాలు చెబుతూ ఇద్దరిన...