Hyderabad, సెప్టెంబర్ 19 -- బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో రెండో వారం కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది. దీనికి సంబంధించిన బిగ్ బాస్ తెలుగు 9 సెప్టెంబర్ 19వ తేది ఎపిసోడ్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో టాస్క్ ఫిజికల్ అయినట్లుగా తెలుస్తోంది.

కెప్టెన్సీ టాస్క్ గురించి భరణి శంకర్ వివరించాడు. "ఈ వారం టెనెంట్స్‌లో ఒకరికి ఓనర్స్‌గా మారి బిగ్ బాస్ మెయిన్ హౌజ్‌లో అడుగుపెట్టడానికి మరో అవకాశం ఇస్తున్నారు. ఓనర్స్ విసిరిన ఐటమ్స్ పట్టుకుని ఎండ్ బజర్ మోగేలోపు వాటిని తమ బాస్కెట్‌లో భద్రంగా దాచుకోవాలి" అని భరణి శంకర్ చెప్పాడు.

ఈ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో తనూజ గౌడ, రాము రాథోడ్, ఫ్లోరా సైని, ఇమ్మాన్యూయెల్, సుమన్ శెట్టి, రీతూ చౌదరి, సంజనతో కలిపి ఏడుగురు కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. వీరికి ఓనర్స్ అయిన శ్రీజ దమ్ము...