Hyderabad, సెప్టెంబర్ 4 -- మళ్లీ బుల్లితెరపై బిగ్ బాస్ తెలుగు టీవీ రియాలిటీ షో సందడి చేయనుంది. సెప్టెంబర్ 7 నుంచి అంటే మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ప్రారంభం కానుంది. స్టార్ మా ఛానెల్‌లో ఆదివారం సాయంత్రం 7 గంటలకు బిగ్ బాస్ 9 తెలుగు టీవీ ప్రీమియర్ కానుంది.

బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ నుంచి హోస్ట్‌గా నిర్వహిస్తున్న టాలీవుడ్ మన్మథుడు నాగార్జున ఈ సీజన్‌కు కూడా వ్యాఖ్యాతగా ఉండనున్నాడు. అయితే, ఇదివరకు ఎప్పుడు లేనంతగా చాలా డిఫరెంట్‌గా బిగ్ బాస్ షో ప్రారంభానికి ముందే అగ్ని పరీక్ష అంటూ కామనర్స్‌ను కంటెస్టెంట్స్‌గా సెలెక్ట్ చేసే ప్రక్రియ మొదలు పెట్టిన విషయం తెలిసిందే.

45 మందితో ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు అగ్ని పరీక్ష ఇప్పుడు టాప్ 6కి చేరుకుంది. టాప్ 6లో దివ్య, ప్రసన్న, పవన్, శ్రేయ, అనుష, శ్వేత కామనర్స్ ఉన్నారు. వీరిలో ఇద్దరు లేదా ఐదు...