Hyderabad, జూలై 14 -- బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌పై హైప్ పెంచడానికి ఇప్పటినుంచే ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు మేకర్స్. ఈపాటికే బిగ్ బాస్ 9 తెలుగు హోస్ట్ నాగార్జున అని కన్ఫర్మ్ అయింది. బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌కు సంబంధించిన రెండు టీజర్స్ రిలీజ్ చేసిన మేకర్స్ కామన్ ఆడియెన్స్‌కు కూడా కంటెస్టెంట్స్‌గా అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారు.

సాధారణంగా ప్రతి సీజన్‌లో ఒక్కరు మాత్రమే కామన్ ఆడియెన్స్ ఉండేవారు. కానీ, ఈసారి ఇద్దరు, ముగ్గురు సాధారణ వ్యక్తులు బిగ్ బాస్ తెలుగు 9లో కంటెస్టెంట్స్‌గా పాల్గొనే ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, బిగ్ బాస్ 9 తెలుగు కంటెస్టెంట్స్‌గా పది మంది సెలెక్ట్ అయినట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి.

వారిలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు వెండితెర, బుల్లితెర నటుడు సాయి కిరణ్, సీరియల్ హీరో ముఖేష్ గౌడ. వీరిద్దరు స్టార్ మా ఛాన...