భారతదేశం, అక్టోబర్ 27 -- బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ జోరుగా సాగుతోంది. వైల్డ్ కార్డ్‌లు ఎంట్రీలు, ఎలిమినేషన్స్, మళ్లీ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ రీ ఎంట్రీలతో రకరకాలుగా సాగిపోతుంది బిగ్ బాస్ 9 తెలుగు. బిగ్ బాస్ న్యూ సీజన్ ఎనిమిదో వారంలోకి అడుగుపెట్టింది. ఇక వారం ప్రారంభం అయిందంటే చాలు హౌజ్‌లో నామినేషన్స్‌ గొడవలతో హౌజ్‌లో రచ్చ జరుగుతుంది.

బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం నామినేషన్స్ కూడా అలాగే గొడవలు, అరుపులు, ఆర్గ్యుమెంట్లతో సాగింది. అయితే, ఈ వారం బిగ్ బాస్ 9 తెలుగు ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్‌తో నామినేషన్స్ నిర్వహించారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన వాళ్లతో 8వ వారం నామినేషన్స్ చేయించారు. అందుకు కత్తితో పొడిచే ప్రక్రియ పెట్టారు.

కెప్టెన్ మినహా మిగతా హౌజ్ మేట్స్ అంతా గార్డెన్‌లో ఒక బోర్డ్ తగిలించుకుని కూర్చుంటారు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌...