Hyderabad, సెప్టెంబర్ 11 -- బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ప్రారంభమైపోయింది. మొత్తం 15 మంది కంటెస్టెంట్స్‌గా హౌజ్‌లోకి అడుగుపెట్టారు. అయితే, ఒక్కో కంటెస్టెంట్ ఒక్కోలా ప్రవర్తిస్తున్నారు. బిగ్ బాస్ 9 తెలుగు హౌజ్‌లో అలకలు, గొడవలు, ప్రేమాయణాలు, నవ్వులు అన్ని సర్వసాధారణమే.

అయితే, తాజాగా బిగ్ బాస్ తెలుగు 9 ఇవాళ్టీ (సెప్టెంబర్ 11) ఎపిసోడ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ ప్రోమోలో జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి ఓ వ్యక్తితో ఫ్లర్టింగ్ చేయడం చూడొచ్చు. అతనెవరో కాదు సోల్జర్ కల్యాణ్. హౌజ్‌లో మొదటి నుంచి కల్యాణ్ పడాలతో రీతూ చౌదరి క్లోజ్‌గా మూవు అవుతుంది.

తాజాగా పాత్రలు శుభ్రం చేసిన రీతూ చౌదరి పక్కనే ఉన్న కల్యాణ్‌తో ఇందులో మీ మొహం కనిపిస్తుందంటూ ఏదో ఒకటి మాట్లాడింది. దానికి సోల్జర్‌ నవ్వి ఊరుకున్నాడు. ఇంతలో గుండు అంకుల్ అని కామెంట్స్ వచ్చిన హరిత హరీష...