భారతదేశం, డిసెంబర్ 8 -- బాలీవుడ్‌ను ఏలిన 'హీ-మ్యాన్', దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఎంతోమంది అభిమానాన్ని చూరగొన్నారు. నవంబర్ 24న లోకాన్ని విడిచి ధర్మేంద్ర వెళ్లిపోయిన విషయం తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో ధర్మేంద్రను తలుచుకుని హోస్ట్ సల్మాన్ ఖాన్ కన్నీటిపర్యంతం అయ్యారు.

అయితే, సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసే రియాలిటీ షో 'బిగ్ బాస్'కు పలుమార్లు అతిథిగా ధర్మేంద్ర హాజరయ్యారు. తాజాగా జరిగిన 'బిగ్ బాస్ 19' గ్రాండ్ ఫినాలే సందర్భంగా, ధర్మేంద్రను గుర్తుచేసుకుంటూ సల్మాన్ ఖాన్ భావోద్వేగానికి లోనయ్యారు.

ముఖ్యంగా, సన్నీ డియోల్, బాబీ డియోల్ తమ తండ్రి అంత్యక్రియలను, ప్రార్థనా సమావేశాన్ని అత్యంత గౌరవప్రదంగా నిర్వహించిన తీరును సల్మాన్ అభినందించారు.

ధర్మేంద్రకు నివాళిగా 'బిగ్ బాస్' హిందీ సెట్‌లో దిగ్గజ నటుడు గడిపిన మరపురాని క్షణాల క్లిప్‌ను ప్రదర్శించార...