భారతదేశం, అక్టోబర్ 30 -- బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ జోరుగా సాగుతోంది. ఎనిమిదో వారానికి చేరుకున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎప్పుడు లేని డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో రంజుగా సాగుతోంది. బిగ్ బాస్‌లో ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ కంటెస్టెంట్స్ శ్రీజ దమ్ము, భరణి శంకర్ రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

వీరిలో భరణి శంకర పర్మనెంట్ హౌజ్‌మేట్‌గా కన్ఫర్మ్ అయ్యారు. ఓ టాస్క్ ద్వారా భరణిని బిగ్ బాస్ తెలుగు 9 కంటెస్టెంట్‌గా రీ ఎంట్రీ ద్వారా చేశారు. అలాగే, ఈ వారం బిగ్ బాస్‌లో నామినేషన్స్ ప్రక్రియను ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌తో నిర్వహించారు. కత్తులతో పొడిచే టాస్క్‌తో బిగ్ బాస్ 9 తెలుగు 8వ వారం నామినేషన్స్ జరిగాయి.

ఎనిమిదో వారం బిగ్ బాస్ తెలుగు 9 నామినేషన్స్‌లో మొత్తంగా 8 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్‌లో తనూజ గౌడ, కల్యాణ్ పడాల, ర...